Consumer

ఇంట్లో అవాంఛిత అగ్నిప్రమాదాలపై భద్రత కోసం గేమ్-ఛేంజర్: ఫైర్‌వాల్ టెక్నాలజీ

ప్రతి ఒక్కరూ అందమైన మరియు ఘనమైన ఫర్నిచర్‌ని ఇష్టపడతారు. అయితే, ఏదైనా అగ్నిప్రమాద సంఘటనలో వుడన్ ఫర్నిచర్ అగ్ని వ్యాప్తికి ఒక మూలముగా పని చేస్తుందనేది వాటి పట్ల సామాన్య మానవుడి ఆందోళన. కాబట్టి, ప్లైవుడ్ తో మీ కలల ఫర్నిచర్ చేయించుకుంటున్నప్పుడు, మీ భయం మిమ్మల్ని ఆపనివ్వకుండా చూసుకోండి. 

ఫైర్‌వాల్ టెక్నాలజీతో గల సెంచురీప్లై ప్లైవుడ్ షీట్లను మీరు ఉపయోగించవచ్చు.  ఏదైనా అవాంఛిత సంఘటన జరిగినప్పుడు మీరు మరియు మీ కుటుంబము క్షేమంగా ఉండేలా టెక్నాలజీ నిర్ధారిస్తుంది.  పైపెచ్చుగా, ఫైర్‌వాల్ టెక్నాలజీ సెంచురీప్లై కే విశిష్టమైనది మరియు మరే ఇతర ప్లైవుడ్ లో మీరు దీనిని చూడలేరు. 

విషయ సూచిక పట్టిక

➔ ఫైర్‌వాల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

➔ ఫైర్‌వాల్ టెక్నాలజీ ఎలా సహాయపడుతుంది?

➔ స్థూలంగా చెప్పాలంటే


ఫైర్‌వాల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

సెంచురీప్లైచే సృష్టించబడిన ఫైర్‌వాల్ టెక్నాలజీ అగ్ని నిరోధకంగా తన విశ్వసనీయతకు పేరు పొందింది. గణనీయమైన సంఖ్యలో సెంచురీప్లై ప్లైవుడ్ షీట్లు ఫైర్‌వాల్ టెక్నాలజీ ఫీచరును కలిగి ఉన్నాయి. మరియు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మీకు అవి ప్రయోజనకరంగా ఉండాలనే విషయాన్ని మనసులో ఉంచుకొని అవి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.  మరి ఇది ఏమి చేస్తుంది?


ఫైర్‌వాల్ టెక్నాలజీ అగ్ని వ్యాపించకుండా నిలువరిస్తుంది మరియు అగ్ని వ్యాపించడానికి ఒక మాధ్యమంగా పని చేయదు. సాధారణంగా, కలపతో అగ్ని చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయినప్పటికీ, ఇది ఫైర్‌వాల్ టెక్నాలజీతో ఉన్న ప్లైవుడ్‌కి భిన్నంగా ఉంటుంది. అది అగ్ని వ్యాప్తిని ఆలస్యం చేస్తుంది కాబట్టి, మీ కుటుంబ సభ్యులు సురక్షితమైన చోటుకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, మరియు మీకు అతిత్వరగా స్పందించేవారికి కాల్ చేయడానికి తగినంత సమయం మీకు దొరుకుతుంది. 

అగ్ని యొక్క మూలము తొలగించబడగానే, ప్లైవుడ్ లోపలి ఫైర్‌వాల్ టెక్నాలజీ తనంత తానుగా స్వీయ అగ్ని-మాపకం అవుతుంది. అదే సమయములో, అది తక్కువ పొగను కలిగిస్తుంది మరియు మీరు ఉక్కిరిబిక్కిరికి గురి కాకుండా కాపాడుతుంది. 

ఫైర్‌వాల్ టెక్నాలజీ ఎలా సహాయపడుతుంది?

ఒక వినాశకర సంఘటన జరుగుతున్న సందర్భంగా ఫైర్‌వాల్ టెక్నాలజీ సహాయపడే మార్గాలు అనేకం ఉన్నాయి. ఇతర ప్లైవుడ్ షీట్ల వలె కాకుండా, ప్లైవుడ్ ఉపరితలానికి రగులుకొన్న అగ్నిని ఆర్పుకోవడంలో ఇది స్వయంగా తన వంతు పాత్ర పోషిస్తుంది. అయితే మీకు టెక్నాలజీ సహాయపడగల మార్గాల్లో ఇది కేవలం ఒక మార్గం మాత్రమే. అది ఉపయోగకరమని నిరూపించే వివిధ మార్గాలలో ఈ క్రిందివి ఉన్నాయి:​​​​​​​

●​​​​​​​ అగ్నికి నెమ్మదిగా ఆహుతి కావడం

అగ్నిప్రమాద సంఘటన ఏదైనా విధ్వంసం అత్యంత సామాన్యమైన మార్గాల్లో మంటలు త్వరగా మరియు సులభంగా రగులుకోవడం అనేది ఒకటి. ఫైర్‌వాల్ టెక్నాలజీ అనేది అగ్ని వ్యాప్తిని నెమ్మదింపజేసే ఒక శ్రేష్టమైన మార్గము. ఫైర్‌వాల్ టెక్నాలజీతో, ప్లైవుడ్ షీటుకు అగ్ని రగులుకోవడానికి సుమారుగా 50 నిముషాల సమయం తీసుకుంటుంది. మీరు మరియు మీ కుటుంబం సురక్షితమైన చోటుకు తరలడానికి మరియు మొదటగా మీరు పిలిస్తే స్పందించే వారికి కాల్ చేయడానికి అది మీకు కొంత అదనపు సమయాన్ని ఇస్తుంది. 

ఆ సమయములో, తదుపరి నష్టం జరగకుండా నివారిస్తూ మీరు అగ్నిపై నీళ్ళు చల్లవచ్చు, దాని మూలాన్ని తొలగించవచ్చు. కొన్ని ఉదంతాల్లో, అగ్ని వేగంగా వ్యాపించిన కారణంగా ఇళ్ళు మరింత ఎక్కువ దెబ్బతినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే, మంట శీఘ్రంగా వ్యాపించడానికి అనుమతించని మెటీరియల్ తో గనక మీరు ఫర్నిచర్ తయారు చేయించినట్లయితే, మీకు చెందిన ప్రశస్తమైన వస్తువుల్ని కాపాడుకోవడానికి మీకు మెరుగైన అవకాశం ఉంటుంది. 

●​​​​​​​ మండగలిగిన గుణం తక్కువ

మండగలిగిన గుణం అనేది నిప్పు రగులుకోవడానికి ఒక ప్లైవుడ్ తీసుకునే సమయాన్ని సూచిస్తుంది. మామూలు ప్లైవుడ్‌కి ఒకసారి అగ్ని రగులుకొందంటే, మీ ఇంట్లో ప్లైవుడ్ చుట్టూ ఉన్న వస్తువులకు వరుసగా అగ్ని వ్యాపించడం కూడా మొదలు కావచ్చు. కఠినమైన పరీక్షలు జరిపిన తర్వాత, ఫైర్‌వాల్ టెక్నాలజీతో ఉన్న ఒక ప్లైవుడ్ ఉపరితలానికి మంటలు వ్యాపించడానికి సుమారుగా 35 నిముషాల సమయం తీసుకుంటుందని సెంచురీప్లై చే కనుగొనబడింది. పోల్చి చూస్తే, మామూలు ప్లైవుడ్ నిప్పును చాలా వేగంగా అందుకుంటుంది మరియు వేగంగా వ్యాపిస్తుంది. అంటే దీని అర్థం, మీకు మరియు మీ కుటుంబానికి అగ్ని నిరోధకంగా ఉండే విషయానికి వచ్చినప్పుడు ఫైర్‌వాల్ టెక్నాలజీ మరింత ఎక్కువ సమర్థవంతంగా ఉంటుందన్నమాట. ​​​​​​​

అంతేకాకుండా పైపెచ్చుగా, మీరు అగ్ని మూలమును తొలగించగానే, మీ ప్లైవుడ్ లోని ఫైర్‌వాల్ టెక్నాలజీ తనంత తానుగా మంటను ఆర్పివేసుకుంటుంది. తక్కువ మండే దీని గుణం, మీరు మీ కుటుంబం మరియు మీకు చెందిన వస్తువులతో సురక్షితమైన చోటును చేరుకోవడానికై మరింత ఎక్కువ సమయాన్ని ఇస్తుంది. 

●​​​​​​​ పెచ్చులు ఊడదు

ఏదైనా అగ్నిప్రమాద సంఘటనలో, మీరు అగ్ని ఆర్పడానికి ప్రయత్నించి, దానిపై నీళ్ళు చల్లితే ప్లైవుడ్ పాడైపోతుందనే ఆందోళనలో ఉంటే, మరేమీ చింతించవద్దు! ఫైర్‌వాల్ టెక్నాలజీతో ఉన్న ఏ ప్లైవుడ్ అయినా మీరు ప్లైవుడ్ పైన నీరు చల్లినా సరే అది వాతావరణం నుండి తేమను పీల్చుకోదు.  అది ఏ మాత్రమూ నీటిని పీల్చుకోదు కాబట్టి, అది పెచ్చులు ఊడదు లేదా నీటి కారణంగా దెబ్బతినదు. 

ఒకసారి అగ్నిని ఆర్పివేశారంటే, ప్లైవుడ్ తో తయారైన ఫర్నిచర్ దాని ఉపరితలానికి ఏ నష్టమూ జరగకుండా సురక్షితంగా ఉంటుంది మరి ఏళ్ళ పాటు దాని భౌతిక శక్తిని నిర్వహించుకుంటూ ఉంటుంది. 

●​​​​​​​ పొగ తక్కువ ఉత్పన్నం అవుతుంది​​​​​​​

ఎక్కడైనా నిప్పు ఉందంటే, అక్కడ విష వాయువులు విడుదల కావడంతో పాటుగా భారీగా పొగ రావడానికి ఎక్కువ అవకాశం ఉండి, దాన్ని పీల్చుకున్న వాళ్ళకు చాలా హానికరంగా ఉండొచ్చు. అటువంటి ఉదంతానికి, కొన్ని రసాయనాలను ఉపయోగించే ఫైర్‌వాల్ టెక్నాలజీ కలిగియున్న సెంచురీప్లై యొక్క ప్లైవుడ్ మరే ఇతర ప్లైవుడ్ కంటే కూడా తక్కువ పొగ ఉత్పన్నమయ్యేలా నిర్ధారిస్తుంది. ​​​​​​​

స్థూలంగా చెప్పాలంటే​​​​​​​

ప్లైవుడ్ షీట్లలో ఫైర్‌వాల్ టెక్నాలజీ  యొక్క ఉపయోగము గణనీయమైనదిగా ఉంటుంది. మరియు ఇది కాలంతో పాటు అరిగిపోదు. ఫర్నిచర్ ఇదివరకే అగ్నిప్రమాదానికి గురైనప్పుడు సైతమూ, అది పూర్తిగా నాశనం అయి ఉండకపోతే, దాని ఉపరితలానికి అగ్ని రగులుకోనంత కాలమూ భవిష్యత్తులో ఫైర్‌వాల్ టెక్నాలజీ పని చేస్తుంది. ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనను ఊహించని ప్రపంచంలో, అవసరం ఉన్న సమయాల్లో ఫైర్‌వాల్ టెక్నాలజీ మీకు రక్షణగా ఉంటూనే ఉంటుంది.

Leave a Comment

Loading categories...

Latest Blogs