Consumer
ఫైర్‌వాల్ టెక్నాలజీ : సెంచురీప్లై చే ఒరిజినల్

అగ్ని అనేది మానవాళిని వెలుగు మరియు వెచ్చదనంతో సాధికారపరచే ఒక గణనీయమైన సహజ శక్తిగా ఉంది.  అది వ్యవసాయం, మెటల్ వర్కింగ్, సిరామిక్స్, మేసనరీ అభివృద్ధి, మరియు ప్రాచీన ప్రజల యొక్క తొలి విద్యుత్ కర్మాగారాల క్రమబద్ధీకరణ అభివృద్ధికి సైతమూ వీలు కల్పించింది. అగ్ని అనేది మానవ మనుగడకు అత్యావశ్యకమైనది, అయినా అది ప్రాణాలు మరియు ఆస్తుల విపత్తు నష్టాన్ని కూడా కలిగించగలదు.

అగ్ని ప్రమాదాల అపాయాల నుండి మీ ఇంటిని మరియు కుటూంబాన్ని రక్షించుకోవడం మీకు అత్యంత ప్రాధాన్యత అయినదిగా ఉండాలి. అందుకనే సెంచురీప్లై కొత్త ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన ప్లైవుడ్‌తో వస్తోంది. ఇది అనూహ్యమైన అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కల్పించడానికి రూపొందించబడిన ఒకానొక అతిగొప్ప ప్లైవుడ్ అయి ఉంది. ఫైర్‌వాల్ టెక్నాలజీతో నిర్మించబడిన ప్లైవుడ్, అగ్ని వేగంగా వ్యాపించకుండా ఆపి మరియు సమర్థవంతమైన రక్షణ కార్యకలాపాలను సానుకూలం చేసేదిగా నిరూపణ అయింది.

విషయ సూచిక పట్టిక

➔ సెంచురీప్లై నుండి ఫైర్‌వాల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

➔ ముఖ్యాంశాలు

      ◆ కనీసంగా మండగలిగిన గుణం

     ◆ అగ్నికి నెమ్మదిగా ఆహుతి కావడం

     ◆ తక్కువగా పొగ ఉత్పత్తి

     ◆ క్షీణత ఉండదు

➔ ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన సెంచురీప్లై యొక్క ప్లైవుడ్ మీకు రక్షణ ఇవ్వడానికి ఎందుకు ఉత్తమమైన ఎంపిక అవుతుంది?

➔ ముగింపు


సెంచురీప్లై నుండి ఫైర్‌వాల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

సెంచురీప్లై నుండి ఫైర్‌వాల్ టెక్నాలజీ అగ్నిప్రమాద ముప్పులకు సాటిలేని సమాధానం.  దీనిని న్యానో-ఇంజనీరింగ్ మూలకాలతో సమృద్ధం చేయడం ద్వారా, ఫైర్‌వాల్ టెక్నాలజీతో జొప్పించబడిన సెంచురీప్లై రూపకల్పన చేయబడిన ప్లైవుడ్‌లు దాని మండగలిగిన గుణాన్ని గొప్పగా తగ్గిస్తాయి మరియు నష్టాన్ని తక్కువ చేస్తాయి. అగ్నిప్రమాద నష్టం నుండి మీ కుటుంబాన్ని రక్షించడానికి ఫైర్‌వాల్ టెక్నాలజీ ప్లైవుడ్‌కి వీలు కలిగిస్తుంది మరియు ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతుంది.


సాధారణ ప్లైవుడ్ సహజంగా అగ్నికి ఆహుతి అయ్యే సాధ్యత అధికంగానే ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలకు గురైతే మండిపోగల మామూలు ప్లైవుడ్ కంటే ఈ ప్లైవుడ్‌లు చాలా ఎక్కువ మంట నిరోధకత కలిగి ఉంటాయి. మంటను మరియు దహనాన్ని తట్టుకోవడానికి గాను ఈ ప్లైవుడ్‌లు జాగ్రత్తగా తయారు చేయబడ్డాయి. తద్వారా, అగ్ని హాని జరిగే సంభావ్యత గల వంటగదులు లేదా ఇతర చోట్లలో వాడటానికి దీనిని కచ్చితమైన ఉత్పాదనగా చేస్తాయి.

ముఖ్యాంశాలు

ఎన్నో సంవత్సరాల పరిశోధన మరియు అభివృద్ధి అనంతరం ఫైర్‌వాల్ టెక్నాలజీ పొందుపరచబడియున్న సెంచురీప్లై రూపొందిత ప్లైవుడ్‌లు అగ్ని మరియు దానితో ముడిపడియున్న మనుషుల మరియు ఆస్తుల విధ్వంసం యొక్క ముప్పును తగ్గిస్తాయి. ఇళ్ళల్లో మంటలు రాకుండా ఉపయోగించడానికి గాను అత్యంత నాణ్యమైన ప్లైవుడ్ గా ఇది అనేక సుగుణాలను కలిగి ఉంది.​​​​​​​

1. కనీసంగా మండగలిగిన గుణం

మండగలిగిన గుణం అనేదాన్ని ఒక ప్లైవుడ్ ముక్క అంటుకొని మండిపోవడానికి మరియు అగ్నిప్రమాదాల ప్రతిచర్యల చైన్ రూపొందడానికి తీసుకునే మొత్తం కాలవ్యవధిగా పేర్కొనవచ్చు.  విస్తృతమైన పరీక్షలు జరిపిన తర్వాత, ఫైర్‌వాల్ జొప్పించబడిన ప్లైవుడ్ దాని ఉపరితలం అంతటా అగ్ని వ్యాపించడానికి 35 నిముషాల సమయం తీసుకున్నట్లుగా పరిశోధకులు కనుగొన్నారు. ఫైర్‌వాల్ యొక్క అగ్ని-నిరోధక ధర్మాలు సమర్థవంతమైనవని నిరూపిస్తూ ఈ కాలవ్యవధి సాంప్రదాయక ప్లైవుడ్ కంటే చాలా తక్కువగా ఉంది.​​​​​​​

2. అగ్నికి నెమ్మదిగా ఆహుతి కావడం

అగ్ని శీఘ్రంగా మరియు తీవ్రంగా వ్యాపించడానికి ప్రధానమైన కారణాలలో, ఇవ్వబడిన నిర్మాణాన్ని బట్టి మంటలు సులువుగా మరియు వేగంగా వ్యాపించవచ్చు అనేది ఒకటి. ఫైర్‌వాల్ టెక్నాలజీ, ఒక ప్లైవుడ్ షీటు ద్వారా మంటలు వ్యాపించే ఒరవడిని నెమ్మదింపజేసి మనుషులు తమను తాము కాపాడుకుంటూ ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి వీలు కలిగేలా సుమారు 50 నిముషాల సమయాన్ని తీసుకుంటుంది.​​​​​​​

3. తక్కువగా పొగ ఉత్పత్తి

ఒక అగ్నిప్రమాదం సందర్భంగా, అనేక హానికరమైన రసాయనాలు మరియు పొగ ఉత్పన్నం అవుతాయి, అవి మనుషులకు చాలా అపాయకరం. ఈ కారణంగా, ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన సెంచురీప్లై యొక్క ప్లైవుడ్ మామూలు ప్లైవుడ్ కంటే అతితక్కువ పొగను- ఉత్పత్తిచేసే రసాయనాలను వినియోగిస్తుంది.​​​​​​​

4. క్షీణత ఉండదు

ఫైర్‌వాల్ టెక్నాలజీచే రక్షితమైన ప్లైవుడ్ వాతావరణ తేమ పట్ల నిరోధకశక్తిని కలిగి ఉంటుంది, కాబట్టి ఫైర్‌వాల్ టెక్నాలజీతో నిర్మించబడిన ఫర్నిచర్ పైన మీరు నీళ్ళు పోసినప్పటికీ అది క్షీణించిపోదు లేదా పాడు కాదు. మీ ఫర్నిచర్ ఎటువంటి హానినీ కలిగించదు మరియు అగ్ని ఆరిపోగానే తన నిర్మాణాత్మక సమగ్రతను నిర్వహించుకుంటుంది.

ఫైర్‌వాల్ టెక్నాలజీ జొప్పించబడిన సెంచురీప్లై యొక్క ప్లైవుడ్ మీకు రక్షణ ఇవ్వడానికి ఎందుకు ఉత్తమమైన ఎంపిక అవుతుంది?

1. నిజమైన IS 5509 ధృవీకృతం మాత్రమే

అనేక కంపెనీలు తాము అగ్ని-నిరోధక ఉత్పత్తులను ఇస్తామని చెబుతున్నప్పటికీ, కేవలం ఫైర్‌వాల్ మాత్రమే ప్రస్తుతం ISO 5509 ధృవీకరణ పొంది ఉంది.​​​​​​​

2. ASTM E84 ప్రమాణంతో సమ్మతివహింపు

ఫైర్‌వాల్ టెక్నాలజీతో జొప్పించబడియున్న ప్లైవుడ్ భారతీయ నిబంధనలతో మాత్రమే కాకుండా అత్యంత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణము ASTM E84 తో కూడా సమ్మతి వహిస్తోంది.​​​​​​​

3. న్యానో-ఇంజనీరింగ్ చేయబడిన మూలకాలతో పొందుపరచబడింది

ఈ ప్లైవుడ్‌లు అంటుకునే లేదా మంట రగులుకునే పరిస్థితిని నివారించేలా ప్రత్యేకంగా రూపొందించబడిన న్యానో-ఇంజనీరింగ్ రేణువులు జొప్పించబడి తయారై ఉంటాయి మరియు గొప్ప అగ్ని- నిరోధక ధర్మాలు కలిగిఉండి ఫైర్-ప్రూఫింగ్ కోసం గొప్ప ఎంపికగా చేస్తాయి.​​​​​​​

4. తక్కువ పొగ మరియు తక్కువ విషవాయువు విడుదల

ఈ ప్లైవుడ్‌లు మెరుగైన అగ్ని-నిరోధక రసాయనాల ప్రత్యేక సమ్మిళితంతో శుద్ధి చేయబడి ఉన్నాయి.  ఆ విధంగా, అగ్నిప్రమాద ఘటన సందర్భంగా పొగ మరియు విషవాయు రేణువులు తక్కువగా ఉత్పన్నమవుతాయి, ఉక్కిరి బిక్కిరి మరియు విషవాయు ప్రభావాల ముప్పు తక్కువవుతుంది.​​​​​​​

5. అగ్నికి ఆహుతి అయ్యే రేటు తక్కువ

ఫైర్‌వాల్ టెక్నాలజీతో 19 ఎంఎం ప్లైవుడ్ షీటు కీలక పరీక్ష పారామితుల క్రింద అంతర్గతంగా మండిపోవడానికి 50 నిముషాల సమయం తీసుకుంటుంది. విరుద్ధంగా, మామూలుగా ఏదైనా మండటానికి 30 నిముషాలు పడుతుంది. అగ్నిప్రమాద ఘటన సందర్భంగా, ఇది మనుషుల్ని రక్షించడానికి మరియు విలువైన వస్తువులు మరియు పత్రాలను భద్రపరచడానికి కూడా తోడ్పడుతుంది.​​​​​​​

6. నాన్-హైగ్రోస్కోపిక్ నిర్మితం

ఫైర్‌వాల్ టెక్నాలజీ-చేర్చబడియున్న ప్లైవుడ్ నాన్-హైగ్రోస్కోపిక్ పదార్థము, అంటే దీని అర్థం, ఇది రసాయన పదార్థాల తేమను తట్టుకునే గుణాన్ని కలిగి హార్డ్ వేర్ భాగాలు కుళ్ళిపోకుండా చేసి పాడుకాకుండా చూస్తుందన్న మాట.​​​​​​​

7. రక్షిత నిర్మాణాత్మక సమగ్రత

న్యానో-ఇంజినీరింగ్ ప్రక్రియకు అదనంగా, వాడిన సామాగ్రి మరియు జిగురు పదార్థాల యొక్క సహజ తన్యత, మంటలు ఏర్పడిన సమయాల్లో సైతమూ ప్లైవుడ్ యొక్క నిర్మాణాత్మక సమగ్రతను చూసుకుంటుంది.​​​​​​​

8. పొడిగించబడిన వ్యారంటీ

ఈ ప్లైవుడ్ తొలిచే పురుగు మరియు చెదలు సోకడంపై రెండు- దశాబ్దాలకు పైగా సుదీర్ఘ వ్యారెంటీని చేరి ఉంది.​​​​​​​

ముగింపు

ఏ ఒక్క ఇల్లు కూడా సంపూర్ణంగా ఫైర్-ప్రూఫ్ కానప్పటికీ సైతమూ, కొన్ని సులభమైన పనులను పాటించడం ద్వారా మీ ఇంటి యొక్క భద్రతను పెంచుకోవడానికి మీరు చేయగలిగింది ఎంతో ఉంది. మీ ఇంటిని సాధ్యమైనంత సురక్షితంగా ఉంచడానికై ఈ అగ్రశ్రేణి, అగ్ని-నిరోధక, పురుగులు- మరియు కుళ్ళు-నిరోధక సామాగ్రినే వాడండి. తక్కువ ఖరీదైనదిగా ఉంటూ ఈ ఆవశ్యకతలన్నింటినీ తీరుస్తున్న  ఫైర్వాల్ టెక్నాలజీతో జొప్పించబడియున్న సెంచురీప్లై యొక్క ప్లైవుడ్ మీకు అద్భుతమైన ఎంపిక అవుతుంది.





Leave a Comment

Loading categories...

Latest Blogs